- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ మృతి.. ఇరాన్‌లో ప్రజల సంబరాలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిని అధికారికంగా ధృవీకరించిన ఇరాన్ మీడియా. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరగగా, ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ (America, Israel) సంయుక్తంగా ఫిబ్రవరి 28న జరిపిన గగనతల దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Supreme Leader Ayatollah Ali Khamenei) మరణించినట్లు మార్చి 1 ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ధృవీకరించింది. ఖమేనీ మృతికి సంతాప సూచికగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు దించడంతో పాటు, ఏడు రోజుల పాటు జాతీయ సెలవు దినాలను కూడా ప్రకటించారు. ఖమేనీ నివాసంపై జరిగిన ఈ దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఒకవైపు ఇరాన్ ప్రభుత్వం (Government of Iran) అధికారికంగా సంతాపం ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమేనీ మృతి వార్త తెలిసిన వెంటనే టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లోని అనేక మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు (Celebrations) చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ బాల్కనీల నుండి బాణసంచా కాలుస్తూ, చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో వస్తున్న మార్పులకు సంకేతం గా నిపుణులు భావిస్తున్నారు.






