- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khamenei: సుప్రీం లీడర్ ఖమేనీ చాప్టర్ క్లోజ్.. ఇరాన్ పగ్గాలు ఎవరికి?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆయన వారసుడు ఎవరు? రివల్యూషనరీ గార్డ్స్ పరిస్థితి ఏంటి? అనేది ఉత్కంఠగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ (Iran), ఇజ్రాయెల్ (Israel), యూఎస్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Khamenei) హతమయ్యారు. ఈ విషయాన్ని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కన్ఫర్మ్ చేశారు. దీంతో ఎన్నో దశాబ్దాలుగా ఖమేనీని ఖతం చేయాలని చూస్తున్న ఇజ్రాయెల్, యూఎస్‍కు భారీ విజయంగా చెప్పవచ్చు. ఖమేనవీ హతమయ్యారనే వార్త నిజమే అయితే ఇరాన్‍ను పాలించబోయేది ఎవరు? ఖమేనీ వారసత్వం ఎవరిది అనే అంశం యావత్ ప్రపంచ దేశాలను ఉత్కంఠ రేపుతోంది.
వారసత్వం కోసం ప్రయత్నాలు:
ఇంత కాలం కనుసైగతో ఇరాన్‍ను శాసించిన ఖమేనీ తాజా దాడుల్లో హతం కావడంతో ఈ కీలక పదవిని దక్కించుకోబోయేది ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ మరియు ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహొల్లా ఖమేనీ మనవడు హసన్ ఖమేనీ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఖమేనీ వారసులు ఎవరు బ్రతికి ఉన్నారు? వారిలో ఎవరికి అధికారం దక్కబోతోంది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశానికి సుప్రీం లీడర్ ఒక మతపరమైన పండితుడై ఉండాలి. ఇరాన్ వ్యవస్థలో 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' (Assembly of Experts) అనే సంస్థ సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంటుంది. అయితే ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది స్పష్టంగా లేదు.
ఇరాన్ రక్షణ మంత్రి సైతం మృతి:
ఇక ఇరాన్ మిలిటరీలో అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఈ పరిణామాల్లో కీలక పాత్ర పోషించనుంది. అయితే, ఈ దాడుల్లో ఐఆర్‌జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్‌పూర్ కూడా మరణించారు. దీంతో ఆ సంస్థ అంతర్గత సమైఖ్యత దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అధికార పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్‌లో ఎన్నికలు జరిగినా సుప్రీం లీడర్ నిర్ణయాలే అంతిమం. గార్డియన్ కౌన్సిల్ వంటి సంస్థల ద్వారా నిరసనలను అణిచివేస్తూ తమ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని మతపరమైన మరియు రాజకీయ వ్యవస్థలు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటాయనేది వేచి చూడాలి.






