- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'KGF' అమితాబ్ సినిమాకు కాపీనా?.. యశ్ సమాధానం వింటే
దిశ, సినిమా: కన్నడ రాక్‌స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్ : చాప్టర్ 2' గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

దిశ, సినిమా: కన్నడ రాక్‌స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్ : చాప్టర్ 2' గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచగా.. 'కేజీఎఫ్'ను డైబ్భై, ఎనభై దశకంలో అమితా బచ్చన్ నటించిన పలు సినిమాలతో కంపేర్ చేయడంపై యశ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పందించాడు. 'ఇది ప్రత్యేకంగా హీరో, అతని హీరోయిజానికి సంబంధించిన కథ. ఏ ఇతర సినిమాతో దీనికి సంబంధం లేదు.
సాధారణంగా ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమా తీయడమే ఫిల్మ్ మేకర్స్ లక్ష్యం. నేను ఎవరిని కలిసినా అలాంటి చిత్రాలే ఇష్టపడతామని చెబుతారు' అని వివరించారు. ఇదే క్రమంలో బిగ్ బీ సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారనే ప్రశ్న యశ్‌కు ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. 'వ్యక్తిగతంగా నాకు రీమేక్స్ ఇష్టముండదు. ఇక బచ్చన్ జీ సినిమాలన్నీ క్లాసిక్స్. వాటిని టచ్ చేయకపోవడమే మంచిది' అని వెల్లడించాడు.






