సీఎంకు పోస్ట్‌కార్డులతో కేజీబీవీ టీచర్ల వినూత్న నిరసన..!

by Batti.Sumithra |

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.

సీఎంకు పోస్ట్‌కార్డులతో కేజీబీవీ టీచర్ల వినూత్న నిరసన..!
X

దిశ, ఏటూరునాగారం : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి టీఎస్ యూటీఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షులు పోడెం సమ్మయ్య హాజరై మాట్లాడారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు దశాబ్దాలుగా శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ వెంటనే మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అందజేసిన హెల్త్ కార్డులను కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులకు కూడా అందజేయాలని కోరారు. అదేవిధంగా, రెగ్యులర్ ఉపాధ్యాయులు వినియోగించుకుంటున్న అన్ని రకాల సెలవులను కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులకు కూడా వినియోగించుకునే అవకాశం కల్పించాలని, హాస్టళ్లకు కేర్‌టేకర్లను నియమించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వార్షిక ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ ఏటూరునాగారం మండల అధ్యక్షులు పత్రి కిరణ్, ఉపాధ్యాయులు ఎం.అరుణ, ఎం. సంతోష్, వై. స్వరూప, బి. హరిత, సమగ్ర శిక్ష ఉద్యోగులు కె.సత్యరావు, ఆర్. విజయ్, చందర్‌రావు పాల్గొన్నారు.

Next Story