- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీతి ఆయోగ్ కీలక సంస్కరణ: కొత్త సభ్యుల నియామకానికి ప్రధాని ఆమోదం!
నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యులుగా డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం, డాక్టర్ జోరామ్ అనియా నియామకం! ప్రధాని మోదీ ఆమోదంతో అమల్లోకి వచ్చిన నియామక ఉత్తర్వులు.

దిశ, వెబ్ డెస్క్: భారత విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించే నీతి ఆయోగ్ (NITI Aayog) లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త సభ్యుల నియామకానికి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం, డాక్టర్ జోరామ్ అనియాలను నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యులుగా (Full-time Members) నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
వివిధ రంగాల్లో విస్తృత అనుభవం ఉన్న వీరి రాకతో నీతి ఆయోగ్ వ్యూహాత్మక నిర్ణయాల్లో మరింత వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీరు తక్షణమే బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి నియామకం ద్వారా సంస్థలో ఖాళీగా ఉన్న స్థానాలు భర్తీ కావడమే కాకుండా, వివిధ అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏప్రిల్ 24, 2026 న విడుదల చేసిన అధికారిక గెజిట్ ప్రకారం, నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా అశోక్ కుమార్ లాహిరి నియమితులు కాగా, రాజీవ్ గౌబా, ప్రొఫెసర్ కె. వి. రాజు, ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్, ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, డాక్టర్ ఎం. శ్రీనివాస్‌లు పూర్తి స్థాయి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు.






