- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు కలిసిరాని కొత్త సంవత్సరం.. 2026 లో ధరల మోతకు అసలు కారణాలు ఇవే!
కొత్త సంవత్సరంలో ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయని సంక్రాంతి, ఉగాది పండుగ ఆఫర్లలో కొత్త ఫోన్లు కొనుగోలు చేయాలని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: 2026 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ ప్రియులకు (Smartphone lovers) అంతగా కలిసి రావడం లేదనే చెప్పుకొవాలి. కొత్త సంవత్సరంలో ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయని సంక్రాంతి, ఉగాది పండుగ ఆఫర్లలో కొత్త ఫోన్లు కొనుగోలు చేయాలని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ గత కొన్ని నెలలుగా కొత్తగా వస్తున్న మొబైల్స్ ధరలు (Mobiles prices) భారీగా పెరుగుతున్నాయి. ఓ రిపోర్ట్ ప్రకారం బడ్జెట్ ఫోన్ల నుండి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు అన్నింటిపై రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో తక్కువ ధరల్లో మంచి ఫీచర్లు ఉండే ఫోన్లను కొనుగోలు చేయవచ్చని ఆశించిన స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఈ పరిణామం షాక్ ఇచ్చింది. అసలు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు 'టెక్' మర్మమేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
AI డిమాండ్ - మెమరీ చిప్స్ కొరత
2025 మొదట్టో అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీకి ప్రస్తుతం భారీ డిమాండ్ (Huge demand) పెరిగింది. దీంతో అన్ని స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. పెద్ద పెద్ద డేటా సెంటర్లు, AI సర్వర్ల కోసం భారీ స్థాయిలో DRAM, NAND ఫ్లాష్ మెమరీ చిప్స్ అవసరం అవుతున్నాయి. దీంతో వినియోగదారుల అభిరుచి, పోటీ మేరకు కొత్తగా వచ్చే అన్ని ఫోన్లలో ఏఐ టెక్సాలజీని అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ వంటి చిప్ తయారీదారులు తమ ఉత్పత్తిని స్మార్ట్‌ఫోన్ల నుండి AI సర్వర్ల వైపు మళ్లించారు. దీనివల్ల మొబైల్ ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ ధరలు 40% నుంచి 60% వరకు పెరిగాయి.
రామ్ (RAM)- స్టోరేజ్ ఖరీదు
2022 వరకు ఉన్న అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉండే రామ్, స్టోరేజ్ భాగాలు చౌకగా ఉండేవి. కానీ భారీగా పెరిగి డిమాండ్లతో 2026 లో పరిస్థితి మారింది. ఫోన్ తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో (Bill of Materials) కేవలం మెమరీలకే.. 15-20% వాటాను ఆక్రమిస్తుంది. దీంతో కంపెనీలు విధిలేని పరిస్థితుల్లో ఆ భారాన్ని వినియోగదారులపై వేస్తున్నాయి. దీంతో పాటుగా అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పుడు తక్కువ ఫోన్లు అమ్మినా, ఎక్కువ లాభం వచ్చేలా తమ వ్యూహాలను మార్చుకున్నాయి. ముఖ్యంగా రూ. 30,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండడంతో, బ్రాండ్లు కూడా ప్రీమియం ఫీచర్ల (Premium features)తో ధరలను పెంచుతున్నాయి.
స్మార్ట్ ఫోన్లపై 2026 బడ్జెట్ ప్రభావం
భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇటీవలి బడ్జెట్ 2026ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో మొబైల్ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో చిప్స్ ధరలు పెరగడం వల్ల ఆ వెసులుబాటు సామాన్యుడికి అందడం లేదు. తయారీ ఖర్చులు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ధరల పెరుగుదలను అడ్డుకోలేకపోతున్నాయి. దీంతో కంపెనీలు తప్పని పరిస్థితుల్లో ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే నథింగ్ (Nothing), వివో (Vivo) వంటి బ్రాండ్లు తమ ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు ధరలు పెంచకుండా ఉండటానికి కెమెరా క్వాలిటీ, డిస్‌ప్లే నాణ్యతలో చిన్నపాటి మార్పులు (Downgrades) చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






