పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న జనసేన కీలక నేత

by Gantepaka Srikanth |

జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న జనసేన కీలక నేత
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. ‘పర్యావరణ పరిరక్షణ కోసం పార్టీ పదవుల నుండి బయటకు వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యానికి సంబంధించి 2020లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేశాను. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో నేను పార్టీ పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకోవడం నా బాధ్యత.

ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీయే(NDA) ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటం, అలాగే పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో పరస్పర ప్రయోజనాల సంఘర్షణను(Conflict of Interest) నివారణ కోసం, స్వచ్ఛమైన నీరు మరియు గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం రాజకీయ కారణాల వల్ల ప్రభావితం కాకూడదని నిర్ధారించడం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఇకపై పర్యావరణ పరిరక్షణపైనే నా దృష్టి 'జల్ బిరాదరీ' నేషనల్ కన్వీనర్‌గా తన బాధ్యతలకు మరియు "మన ముండి - మన నది" కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. పార్టీ పదవి నుండి తత్కాలిక విరామం మాత్రమే, రాజీనామా కాదు. జనసేన సిద్ధాంతాలకు ఆయన కట్టుబడి ఉంటాను. న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత అధిష్టానం కోరుకుంటే పార్టీ బాధ్యతలు మళ్లీ తీసుకుంటాను’ అని బొలిశెట్టి సత్యనారాయణ లేఖలో పేర్కొన్నారు.

Next Story