మహిళా గ్రామసభలో కీలక నిర్ణయాలు.. ప్లాస్టిక్ రహిత గ్రామం లక్ష్యం

by Batti.Sumithra |

సదాశివ నగర్ మండలం ఉత్తనూర్ లో మహిళా ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.

మహిళా గ్రామసభలో కీలక నిర్ణయాలు.. ప్లాస్టిక్ రహిత గ్రామం లక్ష్యం
X

దిశ, సదాశివ నగర్ : సదాశివ నగర్ మండలం ఉత్తనూర్ లో మహిళా ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో మహిళలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. పరిసరాలు, పరిశుభ్రత, మంచి నీటి కొరత, ప్లాస్టిక్ వస్తువుల నిషేధం పై గ్రామసభలో చర్చించి తీర్మానించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన గ్రామస్తులను కోరారు.

బాలల గ్రామసభ..

ఉత్తనూర్ గ్రామపంచాయతీలో శనివారం బాలల గ్రామ సభను నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ చిన్నారులకు ప్లాస్టిక్ వాడకం, దానివల్ల కలిగే నష్టాల పై అవగాహన కల్పించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పిల్లలు ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఇస్తే వారికి తగిన పారితోషకం అందజేస్తామని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ రాజయ్య, పంచాయతీ కార్యదర్శి రాహుల్ పాల్గొన్నారు.

Next Story