- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. MLA షాకింగ్ కామెంట్స్
బీజేపీ సీనియర్ నేత, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పకుందామని అనుకున్నాను. అందరూ కోరుకోవడంతో పాటు మీరే పోటీ చేయాలని బలవంతం చేయడంతో 2024 ఎన్నికల్లో పోటీ చేశాను. అనూహ్యంగా ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీ కూడా వచ్చింది. భవిష్యత్‌లో నేను, నా కుటుంబం నుంచి ఎవరం ఎన్నికల్లో పోటీ చేయం. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటా. ఇక నుంచి నియోజకవర్గంలో ఎవరైనా అన్యాయం, అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించబోం’ అని కామినేని శ్రీనివాస రావు హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. మంగళవారం సంక్రాంతి పండుగ నేపథ్యంలో ‘జూదాలు వద్దు - సాంప్రదాయ క్రీడలే ముద్దు’ అని కామినేని నినాదించారు.
Read More..
సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి : సీఎం చంద్రబాబు






