సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రదేశంగా మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్ : బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రదేశంగా మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన మంగళవారం 14వ SIPB సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీఎం.. సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని తెలిపారు. 15 కిలోమీటర్ల మేర పొల్యూషన్ ఫ్రీ ప్రాంతంగా క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలని సూచించారు. సూర్యలంకతో పాటు సూళ్లూరుపేట వద్ద ఉన్న చిన్న చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చని సూచించారు. మాల్దీవ్స్ రేంజ్ లో ఐల్యాండ్ టూరిజం తయారు చేసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే సూర్యలంక బీచ్ వద్ద 25 వేల గదులను నిర్మించగలిగితే.. పర్యాటకులను వేగంగా ఆకర్షించవచ్చన్నారు. టూరిజం కార్పొరేషన్ దీనిపై దృష్టి పెట్టాలని, టూరిజాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పారు.

Next Story