TG: ఇండియాలో రెండో రాష్ట్రంగా తెలంగాణ

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని సర్జికల్ పీజీ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడం, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తెలంగాణ చాప్టర్- ప్రముఖ వైద్య పరికరాల సంస్థ మెడ్‌ట్రానిక్ ఇండియా మధ్య గురువారం కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

TG: ఇండియాలో రెండో రాష్ట్రంగా తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సర్జికల్ పీజీ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడం, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తెలంగాణ చాప్టర్- ప్రముఖ వైద్య పరికరాల సంస్థ మెడ్‌ట్రానిక్ ఇండియా మధ్య గురువారం కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా సర్జికల్ విద్యార్థులకు అత్యాధునిక శిక్షణ, పరిశోధనలు, నూతన వైద్య విధానాలపై అవగాహన కల్పించనున్నారు. దేశంలో కోల్‌కతా ఏఎస్‌ఐ తర్వాత, ఈ తరహా అంతర్జాతీయ స్థాయి సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. పీజీ విద్యార్థులకు అధునాతన శస్త్రచికిత్స పద్ధతులలో శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ స్థాయి వైద్య పరికరాల వినియోగంపై వర్క్‌షాప్‌లు నిర్వహించడం, మెరుగైన శిక్షణ ద్వారా శస్త్రచికిత్సల నాణ్యతను పెంచి, రోగులకు అత్యుత్తమ వైద్యం అందించడం వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఒప్పందం వల్ల అవకాశం ఏర్పడుతుందని ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డా. బి రమేష్ తెలిపారు. ఈ ఒప్పందం భవిష్యత్ సర్జన్ల నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా, తెలంగాణను మెడికల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Next Story