కేరళ కుంభమేళా.. 270 ఏళ్ల తర్వాత

by Muthe.Rajitha |

కేరళలోని తిరునావాయలో నీలా నది (భారతపుళ) తీరంలో కేరళ కుంభమేళా మహోత్సవం మొదలైంది.

కేరళ కుంభమేళా.. 270 ఏళ్ల తర్వాత
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళలోని తిరునావాయలో నీలా నది (భారతపుళ) తీరంలో కేరళ కుంభమేళా మహోత్సవం మొదలైంది. దీనినే మహా మాఘ మహోత్సవం అని కూడా అంటారు. ఈ కుంభమేళాను కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. సుమారు 270 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించడం విశేషం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం చివరిసారిగా 1755లో జరిగింది. ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ ఉత్సవానికి కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాశీ పండితుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం నీలా హారతి నిర్వహించనున్నారు. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని కేరళ ఆర్టీసీ ప్రత్యేకంగా 100 బస్సులు ఏర్పాటు చేసింది. కుంభమేళా జరిగినన్ని రోజులు కేరళ ప్రభుత్వం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కలరిపయట్టు, యోగా, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మలయాళ సాంస్కృతిక వైభవాన్ని భక్తులకు తెలియజేయనుంది.

Next Story