- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినులకు ప్రతి నెలా 3 రోజులు రుతుక్రమ సెలవులు
కేరళంలో విద్యార్థినులకు నెలకు 3 రోజులు రుతుక్రమ సెలవులు, మహిళా ఉద్యోగులకు 6 నెలల పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ మరియు ఆఫీసుల్లో డేకేర్ సెంటర్ల ఏర్పాటు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కేరళంలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ (UDF) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా అభ్యున్నతి, విద్యార్థినుల సంక్షేమమే ధ్యేయంగా సంచలన నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర తన తొలి ప్రసంగంలో ప్రభుత్వ నూతన విధివిధానాలను వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థినులకు ప్రతి నెలా 3 రోజుల పాటు రుతుక్రమ సెలవులు (Menstrual Leaves) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. విద్యార్థినుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.
ఉద్యోగినులకు గుడ్ న్యూస్..
మహిళా ఉద్యోగుల కోసం కూడా గవర్నర్ ప్రసంగంలో పలు కీలక వరాలు ప్రకటించారు. 50 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయంలో విధిగా నాణ్యమైన డే కేర్ సెంటర్లను (Quality Daycare Centers) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఉద్యోగం చేసే తల్లులకు తమ పిల్లల సంరక్షణ సులువవుతుంది. వీటితో పాటు మహిళా ఉద్యోగులకు పూర్తి జీతం తో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులను (Maternity Leaves) పక్కాగా అమలు చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. మరోవైపు, కేరళను నిరుపేదలు, అనాథలు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం రాష్ట్రంలో చట్టబద్ధమైన దత్తతలను (Adoptions) పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా ప్రోత్సహించనున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.





