- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ నోటీసులపై హైకోర్టుకు కేసీఆర్!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈకేసులో ఇప్పటికే గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు సిట్ విచారణకు హాజరుకాగా.. నెక్స్ట్ కేసీఆర్ విచారణకు రావాలని నోటిసులు జారీ అయ్యాయి. అయితే గులాబీయి బాస్ విచారణకు హాజరవడం పట్ల డ్రామా కొనసాగుతోంది. విచారణకు హాజరవడంపై స్పందించిన కేసీఆర్.. తనకు అనారోగ్య కారణాలు, మున్సిపల్ ఎన్నికల బిజీ షెడ్యూల్ వలన స్వయంగా సిట్ ఆఫీసులో హాజరుకాలేనని, అధికారులే తన ఫామ్ హౌజుకు రావాలని లేఖ రాశారు.
ఈ లేఖపై స్పందించిన సిట్.. ఎర్రవల్లికి రాలేమని, ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లో నందినగర్ కి అయినా రావాలని, ఆ ఇంటికి నోటీసులు అంటించారు. కాగా ఈ వ్యవహారంపై గులాబీ బాస్ హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సిట్ నోటీసులను సవాలు చేస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.






