ఎర్రవెల్లిలో కేసీఆర్ సంక్రాంతి వేడుకలు

by Muthe.Rajitha |

కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా సమయం గడిపిన కేసీఆర్‌

ఎర్రవెల్లిలో కేసీఆర్ సంక్రాంతి వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసంలో, కుటుంబ సభ్యుల నడుమ సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. గురువారం తన శ్రీమతి, పిల్లలతో ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య కేసీఆర్ దంపతుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో భోగి మంటలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా సమయం గడిపిన కేసీఆర్‌.. పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు. గ్రామీణ సంప్రదాయాలు, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి వేడుకలు నిర్వహించగా, ఈ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story