- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవితకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సిందే.. MLA అనిరుధ్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాసన మండలిలో కవిత కన్నీళ్లు పెట్టడం నిజమా లేక యాక్టింగా తేల్చేందుకు లై డిటెక్టర్ టెస్ట్ (Lie detector test) చేయాలని సెటైర్లు వేశారు. నిండు సభలో బీఆర్ఎస్ పార్టీకి కవిత సంధించిన ప్రశ్నలకు గులాబీ పార్టీ పాలమూరు మాజీలు సమాధానం చెప్పాలని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కవితకు భూములు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం కవితకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి (Lakshma Reddy) జాలీ హిల్స్ దగ్గర భారీ ఎత్తున భూములు ఇచ్చారనే ప్రచారం జోరుగా జరుగుతోందని, ఆ విషయం తనకు కూడా సరిగ్గా తెలియదని అన్నారు. ఈ విషయాన్ని గుడిలోకి వెళ్లి దేవుడిపై ప్రమాణం చేసి లక్ష్మారెడ్డి బయటపెడితేనే బాగుంటుందని అనిరుధ్ రెడ్డి కామెంట్ చేశారు.






