అర్థరాత్రి రోడ్డుపై కవిత నిరసన

by Muthe.Rajitha |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అర్థరాత్రి కంచన్ బాగ్ లోని DRDO అపోలో ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.

అర్థరాత్రి రోడ్డుపై కవిత నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అర్థరాత్రి కంచన్ బాగ్ లోని DRDO అపోలో ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ను పరామర్శించేందుకు కవిత అర్థరాత్రి DRDO అపోలో ఆసుపత్రికి వెళ్లగా.. పోలీసులు లోపలికి అనుమతి నిరాకరించారు. ఇందుకు ఆగ్రహించిన కవిత.. శంకర్ గౌడ్ ను పరామర్శించునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కాగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు.

Next Story