Katrina Kaif: బాలీవుడ్ స్టార్ కపుల్స్‌ను చంపేస్తాం.. అపరిచితుడి హెచ్చరిక

by Disha Web |
Katrina Kaif Couple Receive Death Threats On Social Media
X

దిశ, సినిమా: Katrina Kaif Couple Receive Death Threats On Social Media| బాలీవుడ్ క్యూట్ కపుల్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ను చంపేస్తానని ఓ వ్యక్తి భయాందోళనకు గురిచేసినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా గుర్తుతెలియని వ్యక్తి ఈ హత్యాబెదిరింపులకు పాల్పడగా సినీ తారలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ ఇష్యూపై దంపతులిద్దరూ ముంబైలోని శాంటా క్రూజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 506-II, 354-D సెక్షన్‌లు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే.. ఇలాంటి భయంకరమైన పరిస్థితి రావడం ఇదే తొలిసారి అంటున్న సెలబ్రిటీలు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: పన్ను చెల్లింపులో Rajinikanth, Akshay Kumar రికార్డు

Next Story