- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాసలీలల వీడియోలు లీక్.. డీజీపీ స్థాయి అధికారి సస్పెండ్
డీజీపీ స్థాయి అధికారి రాసలీలల వీడియో వైరల్ కావడం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: డీజీపీ స్థాయి అధికారి రాసలీలల వీడియో వైరల్ కావడం కర్ణాటక (Karnataka) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలోనే ఆయన కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం (Government of Karnataka) తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కార్యాలయంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై పోలీస్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమగ్ర నివేదిక కోరగా, హోంమంత్రి పరమేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని సహించేది లేదని స్పష్టం చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, ఈ ఆరోపణలపై రామచంద్రరావు స్పందిస్తూ ఇదంతా తనపై జరిగిన కుట్ర అని పేర్కొన్నారు. ఆ వీడియోలు ఒక ఏడాది క్రితం నాటివని, దీని వెనుక ఉన్న అసలు విషయాలు తనకు తెలియవని ఆయన వాదించారు. అయినప్పటికీ, ఉన్నత పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.






