రంజాన్ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉదయం 8 నుండి 12:45 వరకు మాత్రమే ఉర్దూ పాఠశాలల తరగతులు

by Malleboina Mahesh |

2026 సంవత్సరానికి సంబంధించి.. పవిత్ర రంజాన్ మాసం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఈ పవిత్ర మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రంజాన్ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉదయం 8 నుండి 12:45 వరకు మాత్రమే ఉర్దూ పాఠశాలల తరగతులు
X

దిశ, వెబ్ డెస్క్: 2026 సంవత్సరానికి సంబంధించి.. పవిత్ర రంజాన్ మాసం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఈ పవిత్ర మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో కీలక మార్పులు చేస్తూ ఉర్దూ, ఇతర మైనారిటీ భాషా పాఠశాలల డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉర్దూ మీడియం ప్రాథమిక, ఉన్నత, హైస్కూళ్లన్నీ రంజాన్ నెల రోజులు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తాయి. 2002 అక్టోబరు 31 నాటి స్టాండింగ్ ఆర్డర్‌ను అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

2025-26 విద్యా సంవత్సరానికి వర్తింపు

ఈ మార్పులు ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ ఉర్దూ పాఠశాలలకు వర్తిస్తాయి. రంజాన్ నెల ప్రారంభం నుండి మార్చి 20 వరకు మాత్రమే ఈ ప్రత్యేక పనివేళలు అమలులో ఉంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉపవాస దీక్షలను పాటించే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పాఠశాలల్లో పనిచేసే ముస్లిం సిబ్బంది, విద్యార్థులు కూడా సాయంత్రం నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు అనుమతి కల్పించినట్లు సమాచారం.

Next Story