- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖాకీల అత్యుత్సాహం.. అమాయకులపై లాఠీతో ప్రతాపం
వీణవంకలో పోలీసుల అత్యుత్సాహం! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కోసం కారును చేజింగ్ చేసి, చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై జులుం. గ్రామస్తుల భయాందోళన.

దిశ, కరీంనగర్ బ్యూరో: శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులు రక్షణ ముసుగులో రణరంగం సృష్టిస్తున్నారు. సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ గ్రామాల్లో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. రహదారులపై వాహనాలను చేజింగ్ చేస్తు పల్లెల్లో సినిమా తరహా పరిస్థితులను తలపిస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక తమ చరవాణిలో చిత్రీకరిస్తున్న గ్రామస్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ రౌడీ మూకలను తలపిస్తున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు స్థానికంగా కలకలం రేపగా ఇంతకి పట్టుకున్నది ఎవరిని అనేది స్థానికంగా చర్చానీయాంశంగా మారి పోలీసుల అత్యుత్సాహం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
పోలీసుల అదుపులో ఉన్నది ఎవరు?
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో పోలీసులు ఓ కారును సినిమా స్టైల్‌లో చేజింగ్ చేసి పట్టుకోవడం వివాదస్పదంగా మారింది. అయితే గ్రామంలో జమ్మికుంట, కరీంనగర్ ప్రధాన రహదారిపై రెడ్డిపల్లి గ్రామ కూడలి లో రోడ్డుకు అడ్డంగా బ్రేకర్స్ పెట్టి కరీంనగర్ నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నం చేయగా వాహనదారులు అదే వేగంతో కారును రివర్స్ తీసుకువెళ్లగా అడ్డంగా మరో కారును పెట్టి కారులో ఉన్నవారిని చితకబాది పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే ఏం జరుగుతుందో తెలియని గ్రామస్తులు కంగారుపడ్డారు. అక్కడే ఉన్నా ఓ జర్నలిస్టు సన్నివేశాన్ని చిత్రీకరించడం పై పోలీసులు తీవ్రంగా పరిగణించి జర్నలిస్టుపై వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది
జర్నలిస్టుపై పోలీస్ జులుం
పోలీసులు గ్రామ కూడలిలో బ్రేకర్స్ ఏర్పాటు చేసి నేరస్తులను పట్టుకునేందుకు మాటు వేసి ఉండటం వేగంగా వచ్చిన ఓ కారు అదే వేగంతో వెనక్కి వెళ్లడం పోలీసులు హడావిడి చేయడం గమనించిన జర్నలిస్ట్ ఆ సన్నివేశాన్ని తన మొబైల్‌లో చిత్రికరించాడు. అది గమనించిన పోలీసులు జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించి పోన్ లాక్కోవడ, అక్కడే ఉన్న స్థానిక జనంలోనే జర్నలిస్టుపై నేరస్తుల పట్ల వ్యవహరించే రీతిన వ్యవహరించడంతో స్థానికులు బెంబేలెత్తారు ఏం జరుగుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ భయం గుప్పిట్లో వణికి పోయారు పోలీసులు వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారగా ఇంతకి పోలీసులు పట్టుకున్నది నక్సలైట్లు?లేక అంతర్జాతీయ నేరగాళ్ల ?కరుడుగట్టిన తీవ్రవాదుల? అనే చర్చా స్థానికంగా కలకలం సృష్టిస్తుంది
పోలీసుల అదుపులో ఉన్నది ఎవరు?
వీణవంక ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు సినిమా సన్నివేశాన్ని తలదన్నేలా పట్టుకుని చితకబాది అదుపులోకి తీసుకున్నది ఎవరిని అనేది స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తప్పించుకుని వస్తున్నారు. అందుకే అలా వ్యవహరించాల్సి వచ్చింది అని చెబుతున్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి కోసం ఇంతలా సినిమా సన్నివేశాన్ని తలదన్నేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ పోలీసులు అదుపులోకి తీసుకున్నది ఎవరిని అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.






