పాపా జో.. నువ్వు ఏడ్చే రోజులు దగ్గరపడ్డాయి.. కంగనా

by Javid Pasha |

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరో వివాదానికి తెరలేపింది. తను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘లాక్ అప్’ షో.. Latest Telugu News..

పాపా జో.. నువ్వు ఏడ్చే రోజులు దగ్గరపడ్డాయి.. కంగనా
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరో వివాదానికి తెరలేపింది. తను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' షో తాజాగా 200 మిలియన్‌ వ్యూస్‌ సాధించడంతో ఆనందం వ్యక్తం చేసిన కంగనా.. ఇదే క్రమంలో కరణ్‌ జోహార్‌‌పై తనదైన శైలిలో సెటైర్‌ వేసింది. ఈ మేరకు షో సక్సెస్ గురించి గొప్పగా చెబుతూ ఇన్‌స్టాలో స్టోరీ షేర్‌ చేసిన నటి.. 'లాక్‌అప్‌' షో 200 మిలియన్‌ వ్యూస్ చేరుకోవడం చూసి కొంతమంది రహస్యంగా ఏడవబోతున్నారు. వాళ్లందరితో పాటు నువ్వు ఏడ్చే రోజు వచ్చేసింది పాపా జో' అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అయితే 'పాపా జో' అంటే కరణ్‌ జోహార్‌ అని, ఆయన కొంతమందితో కలిసి తన షోను నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లు కంగనా భావిస్తోందని తెలుస్తోంది. అందుకే కరణ్‌ను టార్గెట్ చేసిందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తుండగా.. కంగనా, కరణ్ మధ్య 2017లో ఫైట్ మొదలైన సంగతి తెలిసిందే.

Next Story