Dhaakad Movie Trailer : కంగనా "ధాకడ్‌" లేటెస్ట్ అప్‌డేట్.. ఆకట్టుకుంటున్న ఆల్ ఇన్ వన్ టీజర్

by Dishafeatures2 |
Dhaakad Movie Trailer : కంగనా ధాకడ్‌ లేటెస్ట్ అప్‌డేట్.. ఆకట్టుకుంటున్న ఆల్ ఇన్ వన్ టీజర్
X

దిశ, సినిమా: కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛాలెంజింగ్‌ పాత్రలు చెయ్యడంలో ఆమె ముందుంటారు.ఈ మధ్యకాలంలో వచ్చిన 'జడ్జ్‌మెంటల్‌ హై క్యా' సినిమాలతో అలరించిన కంగనా తర్వాత రాబోయే స్పై థ్రిల్లర్ యాక్షన్ చిత్రం 'ధాకడ్‌' . ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో కంగనా లేడి ఫైటర్‌గా, గూఢచారిగా కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను ఆమె మంగళవారం మధ్యాహ్నం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఈ టీజర్‌‌లో ఆమె ఏజెంట్ అగ్ని అనే గూఢచారిగా , మారువేషాలు వేయడంలో నిష్ణాతురాలుగా , యుద్ధంలో ప్రావీణ్యురాలిగా కనిపించింది. ఒక చీకటి గదిలో ఆమె హ్యాండ్లర్ నుండి కాల్ రావడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. కంగనా వెనుక ఉన్న అల్మారాలో పేర్చబడిన ఆయుధాలతో కూడిన పెద్ద గన్‌ని పట్టుకుని కెమెరా వైపు చూస్తున్న షాట్‌తో ఈ టీజర్ ముగుస్తుంది. అయితే ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, కంగనా ఇలా క్యాప్షన్ ఇచ్చింది. "యాక్షన్. స్టైల్. థ్రిల్. ఆల్ ఇన్ వన్, ఏజెంట్ అగ్ని ఇక్కడ ఉంది!!. ఇక ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story

Most Viewed