కల్కి-2 సెట్లోకి కమల్.. ఈ లెజెండరీ చేసిన పనికి హ్యాట్సాఫ్ అంటున్న నిర్మాణ సంస్థ

by Muthe.Rajitha |   (  Updated:2026-05-19 05:49:02  IST  )

సినిమా బడ్జెట్‌ను తగ్గించే క్రమంలో కమల్ ప్రైవేట్ చార్టర్ విమానాలను పక్కనబెట్టి, సాధారణ ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ షూటింగ్ సెట్స్‌కు హాజరు కావడంతో నిర్మాణ సంస్థ హ్యాట్సాఫ్ చెప్పింది.

కల్కి-2 సెట్లోకి కమల్.. ఈ లెజెండరీ చేసిన పనికి హ్యాట్సాఫ్ అంటున్న నిర్మాణ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ షూటింగ్ స్పీడ్ అందుకుంది. ఈ సినిమాలో కమల్‌హాసన్ 'సుప్రీం యాస్కిన్' అనే పవర్‌ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. తాజా షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొనడానికే కమల్ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కమల్ చేసిన ఓ పనికి చిత్ర నిర్మాణ సంస్థ హ్యాట్సాఫ్ చెబుతోంది. కమల్ ప్రయివేట్ జెట్లో కాకుండా ఎకానమీ క్లాస్ లో ప్రయాణించి హైదరాబాద్ చేరుకోవడంతో వైజయంతీ మూవీస్ ఆ ఫొటోను పంచుకుంటూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా నిర్మాణ బడ్జెట్ కంటే నటీనటుల రెమ్యునరేషన్, వారి విలాసవంతమైన క్యారవాన్లు, ప్రైవేట్ జెట్లు వంటి వాటికే బడ్జెట్‌లో అధికంగా ఖర్చవుతోంది.

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ తీసుకున్న నిర్ణయం ఆయన సింప్లిసిటీని, సినిమా పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. సినిమా బడ్జెట్‌ను తగ్గించే క్రమంలో ఆయన ప్రైవేట్ చార్టర్ విమానాలను పక్కనబెట్టి, సాధారణ ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ షూటింగ్ సెట్స్‌కు హాజరు కావడంతో కమల్ కు హ్యాట్సాఫ్ చెప్పింది. చిత్ర పరిశ్రమలో అద్భుతాలు జరగడానికి ఇదొక మొదటి అడుగు అని, ఆయన ఎంతటి దిగ్గజ నటుడో ఈ ఒక్క నిర్ణయమే నిరూపిస్తోందని వైజయంతీ సంస్థ కొనియాడింది.

టాప్ ట్రెండింగ్‌లో ‘పెద్ది’ ట్రైలర్.. యూట్యూబ్‌లో ఎన్ని వ్యూస్ రాబట్టిందో తెలిస్తే షాక్!

Next Story