- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాప్ ట్రెండింగ్‌లో ‘పెద్ది’ ట్రైలర్.. యూట్యూబ్‌లో ఎన్ని వ్యూస్ రాబట్టిందో తెలిస్తే షాక్!
కేవలం కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1.67 కోట్ల వ్యూస్ సాధించడమే కాకుండా, 4 లక్షల లైక్స్, 63 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను పూర్తిగా షేక్ చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రికార్డులను తిరగరాయడానికి ముందే, ఇంటర్నెట్ ఊపేస్తూ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ మాస్ విశ్వరూపాన్ని, నటనను చూసిన ప్రేక్షకులు అభిమానులు థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అంటూ ప్రశంసల కురిపిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేశారు.
ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుంచి జనాలు ఎగబడి చూస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1.67 కోట్ల వ్యూస్ సాధించడమే కాకుండా, 4 లక్షల లైక్స్, 63 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచి ఈ ట్రైలర్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ఒక గ్రామీణ క్రీడాకారుడిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.






