నందమూరి హీరోల చెయ్యి పడితే.. దర్శకుల దశ తిరిగినట్టే!

by Disha Web Desk 7 |
నందమూరి హీరోల చెయ్యి పడితే.. దర్శకుల దశ తిరిగినట్టే!
X

దిశ, సినిమా : సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొందరికి ఒక్కోసారి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ దక్కితే.. చాలామందికి చాలా ఏళ్లు శ్రమిస్తే గానీ విజయం వరించదు. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీతో పలువురు దర్శకులకు అదృష్టం కలిసొచ్చిందనేది వాస్తవం. ఎన్టీఆర్‌‌ నటించిన 'స్టూడెంట్ నం.1', 'ఆది' చిత్రాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఎస్ ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. తనను కూడా డెబ్యూ డైరెక్టర్స్ అదృష్టంగా భావిస్తున్నారు.

కళ్యాణ్‌ రామ్‌ కెరియర్ విషయానికొస్తే.. 'అతనొక్కడే' మూవీతో సురేందర్ రెడ్డి, 'పటాస్' చిత్రంతో అనిల్ రావిపూడి దర్శకులుగా పరిచయం కాగా వారిద్దరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం 'బింబిసార' సినిమాతో మల్లిడి వశిష్ట సైతం డెబ్యూ డైరెక్టర్‌గా సక్సెస్‌ అందుకున్నాడు. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సోమవారం నుంచి అన్ని ఏరియాల్లో ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లే అవకాశముందని అంచనా. ఈ లెక్కన నందమూరి ఫ్యామిలీ.. డెబ్యూ దర్శకులకు లక్కీ హ్యాండ్ అని మరోసారి నిరూపించుకున్నారు.

Next Story

Most Viewed