- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దర్ గేటు దగ్గరే ఆగిపోవడానికి, ఈటల సస్పెన్షన్‌కు అతనే కారణం: కవిత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దగ్గ ఉన్న మొదటి దెయ్యం సంతోష్ రావే అని కుండబద్దలు కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు ప్రధాన గూఢచారి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నారా?, సగం ఇడ్లీ తిన్నారా అనే సమాచారం రేవంత్ రెడ్డికి చేరవేసేది సంతోష్ రావే అన్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్‌లో ఎందరో నేతల కన్నీళ్లకు కూడా అతనే కారణమని తెలిపారు. ప్రగతి భవన్ గేటు ఎదుట గద్దర్‌ను నిలబెట్టడానికి కారణం, పార్టీ నుంచి ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయడానికి కారణం కూడా సంతోష్ రావే అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
సకల దుర్మార్గాలకు కారణం సంతోష్ రావే
కేసీఆర్‌ను ఉద్యమకారులు, ప్రజలకు దూరం చేసింది కూడా సంతోషే. హరీష్ రావు, కేటీఆర్‌లు కూడా సంతోష్‌కు అనుకూలంగా ఉన్నారు. అందుకే పార్టీ పరిస్థితి ఇలా ఏడ్చింది. దెయ్యాలను వదిలించుకోకపోతే ఇంకా దారుణమైన పరిస్థితిని చూడాల్సి వస్తుంది. రెచ్చిపోయి ట్వీట్‌లు పెట్టే ముందు బీఆర్ఎస్ శ్రేణులంతా ఓసారి ఆలోచించుకోవాలి. పార్టీలో సకల దుర్మార్గాలకు కారణం సంతోషే. నాకు తెలిసి కచ్చితంగా సంతోష్ రావును రేవంత్ రెడ్డి కాపాడుకుంటాడు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసులో సిట్ అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని కల్వకుంట్ల కవిత కోరారు.






