మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుంటే నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

by Jakkula.Mamatha |

సింగరేణి సంస్థ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న 1200 మందికి ఉద్యోగాలు ఇవ్వకుంటే నెల అనంతరం నిరాహార దీక్ష చేపడతామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు.

మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుంటే నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: సింగరేణి సంస్థ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న 1200 మందికి ఉద్యోగాలు ఇవ్వకుంటే నెల అనంతరం నిరాహార దీక్ష చేపడతామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. శనివారం ఆమె కేటీకే 5 సందర్శించిన అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లో నడిపిస్తుందని కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. ఉద్యమ కాలం నుండి నేను సింగరేణి కార్మికులతో పనిచేసిన తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించిన తెలంగాణ రక్షణ సేనను ఆదరించాలని ఆమె కార్మికులను, భూపాలపల్లి ప్రజలను కోరారు. సింగరేణి వ్యాప్తంగా మంచి నీళ్ళు మంచి గాలి లోపలికి ఇవ్వలేకపోతున్నారని కనీస అవసరాలైన గాలి, నీళ్ళను కకృతి పడకుండా స్వచమైనవి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇప్పుడు సింగరేణి అధికారులు పోరాటం చేస్తున్నారని వారికి మద్దతు ఇవ్వాలంటే మా కార్మికులకు మెమోలు ఇవ్వొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. మొన్న డిటోనేటర్ పేలి మన కార్మికుడికి గాయాలు అయ్యాయని నాసిరకం డిటోనేటర్ సింగరేణి వాడటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఏదైనా పని జరగాలంటే నేరుగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి లంచం అడుగుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఒక నెల సమయం ఇస్తున్నాము. 1200 మంది కార్మికులకు మెడికల్ బోర్డుకు అప్లై చేసిన వారిని పిలిచి వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే జూలై 20వ తేదీ నుంచి నిరహార దీక్ష చేయ బోతున్నామన్నారు. విజిలెన్స్ ఎంక్వయిరీలతో కార్మికులను ఇబ్బంది పెట్టొద్దని, మారుపేర్లను సరిచేయాలని ప్రభుత్వం, కార్మిక సంఘం ఇల్లు కట్టుకోవడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని, సింగరేణికి సపరేట్‌గా హౌసింగ్ బోర్డు పెట్టాలని ప్రతిపాదన చేస్తున్నామన్నారు. హౌసింగ్ బోర్డు ద్వారా రిటైర్మెంట్ అయిన కార్మికులకు ఇళ్లు ఇప్పించేలా చేస్తామన్నారు. కార్మికుల రక్షణ కోసం బాధ్యతగా సింగరేణి వ్యవహరించాలని ఆమె సూచించారు.

Next Story