పార్టీ మూడ్‌లో కాజల్.. వైరల్‌గా లేటెస్ట్ పిక్స్

by Disha Web Desk 4 |
పార్టీ మూడ్‌లో కాజల్.. వైరల్‌గా లేటెస్ట్ పిక్స్
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా.. తనకు 'నీల్ కిచ్లు'గా పేరు పెట్టుకుంది. అయితే డెలివరీ తర్వాత రీసెంట్‌గా మరోసారి తన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న కాజల్.. రేపు(ఆదివారం) తన బర్త్ డే కాగా, ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ మొదలయ్యాయని తెలిపింది. అందులో భాగంగా భర్తతో కలిసి ప్రీ బర్త్‌డే డేట్‌కు వెళ్లినట్లు చెప్పింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో కాజల్ కేక్ తినిపిస్తుండగా.. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఒక బిడ్డకు తల్లయినా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్న కాజల్.. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed