రంజాన్ ఉపవాస ప్రార్థనల్లో కచ్చా బాదమ్ ట్యూన్.. పాకిస్థానీ పై ఫైర్

by Disha Web Desk 12 |
రంజాన్ ఉపవాస ప్రార్థనల్లో కచ్చా బాదమ్ ట్యూన్.. పాకిస్థానీ పై ఫైర్
X

దిశ, సినిమా : బెంగాలీ వైరల్ సాంగ్ 'కచ్చా బాదమ్' క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీధులు తిరుగుతూ పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్‌ను సెలబ్రిటీని చేసిన ఈ పాట.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ప్లే అవుతూనే ఉంటుంది. ఇండియానే కాదు యూఎస్, కొరియా ప్రజలు కూడా ఈ డ్యాన్స్ చాలెంజ్‌లో పాల్గొని ఎంజాయ్ చేవారు.

అలాంటి పాటను ఇప్పుడు పాకిస్థానీ యూట్యూబర్ యాజీర్ సోహర్వాద్రి ఖూనీ చేశాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రంజాన్ ఉపవాస ప్రార్థనల ప్రాముఖ్యత తెలిపేందుకు.. ఈ ట్యూన్ ఎంచుకోవడం పై మండి పడుతున్నారు. ఇక కొందరేమో ఒక్క పాట రెండు దేశాల మధ్య గీతను చెరిపేసిందని అంటుంటే.. మరికొందరు కచ్చా బాదమ్ ట్యూన్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed