KA Paul: 'ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేస్తారా?'

by GSrikanth |   (  Updated:2022-07-18 10:48:31  IST  )

KA Paul Criticizes CM KCR Over Cloudburst Comments| తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్

KA Paul Criticizes CM KCR Over Cloudburst Comments
X

దిశ, వెబ్‌డెస్క్: KA Paul Criticizes CM KCR Over Cloudburst Comments| తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేయడం ఏంటి అని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై వచ్చే బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్నానని చెప్పారు. ఈ ధర్నాకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్ ఇతర పార్టీకి చెందిన నాయకులు ధర్నాకు రావాలని పిలుపు నిచ్చారు. తాను చేపట్టబోయే ధర్నాకు మద్దతుగా కేసీఆర్ పది నిమిషాలు నాతో పాటు కూర్చోవాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కేసీఆర్ పారాసిటీ మాల్ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాడు.. దాని వల్ల లక్షల మంది చనిపోయారని అన్నారు. ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ గురించి కూడా ఆయన వ్యాఖ్యలు అంతే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రధాని అవుతాడని విదేశీయులు కుట్రపడ్డారని, అందులో భాగంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందనీ కేసీఆర్ కామెంట్స్ చేశాడని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15 వరకు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఢిల్లీలో ఆమరహణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.

పవన్‌కు జగన్‌ను తిట్టడం తప్ప ఏమీ తెలియదు:

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ సీఎం జగన్‌కు తిట్టడం తప్పా ఏమీ తెలియదని కేఏ పాల్ విమర్శించారు. ఈ పదేళ్లలో పవన్ 9 పార్టీలతో జతకలిశారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలతో సహా అన్ని పార్టీలతో అంటకాగారని.. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఎవరు నమ్మటం లేదని అందుకోసమే ఒక్క లీడర్ కూడా ఆయన దగ్గర ఉండట్లేదని అన్నారు. జేడీ లక్ష్మినారాయణ లాంటి నాయకులే జనసేనను వీడి వెళ్లిపోయారని గుర్తు చేశారు.

వారి బెదిరింపులకు భయపడేదే లేదు:

తాను హైదరాబాద్‌లో గ్లోబల్ సబ్మిట్ పెడతానంటే గుజరాత్‌లో పెట్టాలని బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, అయితే తాను మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం హైదరాబాదులోనే గ్లోబల్ సబ్మిట్ పెడతానని స్పష్టం చేశారు. తాను రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని, 8 కోట్ల తెలుగు ప్రజల బాగుకోసం ఎంత దూరమైన వెళ్తానన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరు తెలుగు రాష్ట్రాలను అప్పుల కుప్పలో ముంచేశారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఐదు లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్ల లక్షల అప్పులు చేశారని మండిపడ్డారు. భారతదేశం త్వరలో వెనిజులా, శ్రీలంక కాబోతోందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ట్వీట్..

Next Story