- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ఆర్‌టీపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా జేవీఆర్
by Malleboina Mahesh |
దిశ, నేరేడుచర్ల : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్ఆర్‌టీపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా latest telugu news..

X
దిశ, నేరేడుచర్ల : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్ఆర్‌టీపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన జల్లెపల్లి వెంకటేశ్వరరావు(జే వి ఆర్) నియమితులయ్యారు. గతంలో ఆయన డీసీఎంఎస్ చైర్మన్ గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డికి విధేయుడిగా పనిచేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టిన పార్టీలో చేరారు.
ఈ మేరకు వైఎస్ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు శనివారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు(జే వి ఆర్) మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా పని చేస్తానని తనపై నమ్మకంతో నియమించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






