- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలిఫోర్నియాలో పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్న జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

దిశ, వెబ్ డెస్క్: కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau), ఆయన ప్రేయసి, ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీల(Katy Perry) మరోసారి కెమెరాలకు చిక్కారు. ఈ సారి ఓ పార్కులో ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నట్లు వీడియో వైరల్ అయింది. దీంతో వారి రొమాంటిక్ పిక్నిక్ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటికిమొన్న అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఫిఫా (FIFA) వరల్డ్ కప్ మ్యాచ్‌కు కలిసి హాజరైన ఈ జంట.. ప్రస్తుతం కాలిఫోర్నియాలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.
అక్కడి ఒక అందమైన పార్క్ లో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా గడుపుతూ, ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్నిక్ సమయంలో కేటీ పెర్రీ ఐదేళ్ల కుమార్తె డెయిసీ డోవ్ కూడా వీరితోనే ఉంది. ట్రూడో ఆ చిన్నారితో ఎంతో సరదాగా ఆడుకుంటూ కనిపించారు. వీటికి సంబంధించిన అందమైన క్షణాల ఫొటోలను కేటీ పెర్రీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఈ క్రేజీ లవ్ స్టోరీ నెట్టింట సంచలనం రేపుతోంది.






