ఆమెతో బ్రేకప్ కెరీర్‌పై ప్రభావం చూపింది.. జస్టిన్ బీబర్

by Disha Web Desk 2 |
ఆమెతో బ్రేకప్ కెరీర్‌పై ప్రభావం చూపింది.. జస్టిన్ బీబర్
X

దిశ, సినిమా: యంగ్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ మాజీ లవర్‌ సెలీనా గోమెజ్‌తో విడిపోవడంపై ఓపెన్ అయ్యాడు. మొదట్లో తమ బంధం బాగానే కొనసాగిన తర్వాత గజిబిజిగా మారిపోయిందని, దీంతో కొంతకాలం తన సంగీతం గాడి తప్పిందని తెలిపాడు. అయితే మళ్లీ సెలీనా టాలెంట్ తనను ప్రేరేపించిందన్న ఆయన.. త్వరలో రాబోయే తన న్యూ ఆల్బమ్‌ గురించి ప్రముఖ చానెల్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ మేరకు చాలా విషయాల్లో సెలీనా నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలిపాడు. అలాగే తమ సుదీర్ఘ సంబంధంలో హృదయాలను గాయపరిచిన అనేక విషయాలను ఇందులో చేర్చాలనుకున్నప్పటికీ.. భావోద్వేగాలు మదిలో అలజడులు సృష్టించాయని, ఈ ఆల్బమ్‌లో కొంతవరకు బయటపడతాయని వెల్లడించాడు. ఇక 2010 నుంచి డేటింగ్ చేసిన ఈ జంట మూడేళ్ల తర్వాత విడిపోగా.. అమెరికన్ మోడల్ హేలీ బాల్డ్‌విన్‌‌తో కొంతకాలం డేటింగ్ చేసి 2018లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు జస్టిన్. కాగా ప్రస్తుతం ఆయన ముఖ పక్షవాతంతో బాధపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed