- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఆదాయానికి మించి 938 శాతం ఆస్తులు
రాజస్థాన్ ఉదత్ గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ శుభకరణ్ పరిహార్ నివాసాల్లో ఏసీబీ జరిపిన సోదాలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ సోదాల్లో రూ. 76 లక్షల నగదు, 1.5 కిలోల బంగారం, 42 ఎకరాల భూమి, 4 లగ్జరీ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఏకంగా 938 శాతం అక్రమాస్తులు కూడబెట్టిన ఈ చిరుద్యోగి బాగోతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు ఆదాయానికి మించి 938 శాతం ఆస్తులు కనిపించడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని పలోడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉదత్ గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శుభకరణ్ పరిహార్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఏసీబీ (Anti-Corruption Bureau) రంగంలోకి దిగారు. అతని ఇంట్లో అక్రమాస్తుల చిట్టా చూసి అధికారులే విస్తుపోయారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పక్కా సమాచారంతో అధికారులు బీకనేర్, పలోడి ప్రాంతాల్లోని ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కేవలం 16 ఏళ్ల సర్వీసున్న ఒక చిన్న స్థాయి ఉద్యోగి వద్ద ఏకంగా 938 శాతం అధికంగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
సోదాల సందర్భంగా అధికారులు సుమారు 76 లక్షల రూపాయల నగదు, కేజీన్నరకు పైగా బంగారం, మూడు కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించడానికి ఏసీబీ సిబ్బందికి గంటల సమయం పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే, బీకనేర్, పునరాసర్‌లో అత్యంత విలాసవంతమైన 4 లగ్జరీ బంగ్లాలు, పలు ఖరీదైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు మూడు లగ్జరీ కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ఆయన గ్యారేజీలో దర్శనమిచ్చాయి.
ఉద్యోగ రీత్యా జూనియర్ అసిస్టెంట్ అయినప్పటికీ, ఈయన సంపాదన మాత్రం అపర కుబేరుడిని మించిపోయింది. సుమారు 42 ఎకరాల (100 బీఘాలు) సాగు భూమికి సంబంధించిన పత్రాలను కూడా అధికారులు సీజ్ చేశారు. తన అధికారిక వేతనం కంటే కొన్ని వందల రెట్లు అక్రమంగా ఎలా సంపాదించాడనే కోణంలో ఏసీబీ లోతైన విచారణ జరుగుతోంది. ఒక సామాన్య చిరుద్యోగి ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరనే అంశంపై ఇప్పుడు రాజస్థాన్ రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.






