- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై జోస్ బట్లర్ ప్రశంసల జల్లు: 'అతడొక అథెంటిక్ లీడర్'
గిల్ ఒక అథెంటిక్ లీడర్; కెప్టెన్సీ వల్ల అతడి బ్యాటింగ్ మరింత మెరుగైంది. గత ఏడాదిలో గిల్ ఎంతో పరిణతి సాధించాడు. - జోస్ బట్లర్ ప్రశంసలు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ గతంలో ఎన్నడు లేనివిధంగా మొత్తం 10 జట్లకు ఇండియన్ ప్లేయర్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టులోని కీలక ప్లేయర్లు ఆయా జట్లకు కెప్టెన్లుగా వహరిస్తున్నారు. ముఖ్యంగా అన్ని జట్ల కెప్టెన్లు యువ ప్లేయర్లే కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ తన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వ లక్షణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, అతడు ఎప్పుడూ తన సహజ సిద్ధమైన శైలిలోనే ఉంటూ జట్టును నడిపిస్తాడని బట్లర్ కొనియాడారు. ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద లక్షణం తన నిజాయితీని కోల్పోకుండా ఉండటమేనని, గిల్ ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడని ప్రశంసించారు.
గత కొద్దికాలంగా అటు గుజరాత్ టైటాన్స్‌కు, ఇటు భారత జట్టుకు నాయకత్వం వహించడం ద్వారా గిల్ ఎంతో పరిణతి సాధించాడని బట్లర్ అభిప్రాయపడ్డారు. అలాగే కెప్టెన్సీ బాధ్యతలు వచ్చిన తర్వాత గిల్ బ్యాటింగ్ మునుపటి కంటే మెరుగ్గా మారిందని, ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతడి ప్రదర్శనే దీనికి నిదర్శనమని బట్లర్ గుర్తు చేశారు. నాయకత్వ బాధ్యతలు పెరిగినప్పటికీ గిల్ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదని, తనను తాను నమ్ముకుంటూ సొంత శైలి లో నిర్ణయాలు తీసుకుంటాడని విశ్లేషించారు. తన చుట్టూ ఉన్న నమ్మకస్తుల అండతో గిల్ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడని, ఈ సీజన్‌లోనూ అతడి నాయకత్వంలో ఆడేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు బట్లర్ స్పష్టం చేశారు.






