బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరికలు

by Malleboina Mahesh |

దిశ, చౌటుప్పల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో పలువురు శనివారం బీజేపీ పార్టీలో చేరారు. latest telugu news..

బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరికలు
X

దిశ, చౌటుప్పల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో పలువురు శనివారం బీజేపీ పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన పలువురు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న బండి సంజయ్ మార్గమధ్యలో కొయ్యలగూడెం వద్ద ఆగారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీ లో చేరుతున్న కార్యకర్తలతో కలిసి కాసేపు మాట్లాడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, దూడల బిక్షం గౌడ్, రమనగోని శంకర్, బత్తుల జంగయ్య గౌడ్, ఊడుగు వెంకటేశం, గుజ్జుల సురేందర్ రెడ్డి, కడవేరు పాండు తదితరులు ఉన్నారు.

Next Story