- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Johnson and Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ తో క్యాన్సర్.. రూ.52 వేల కోట్ల పరిహారం
అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) తమ బేబీ పౌడర్ వాడకం వల్ల అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) బారిన పడ్డామని నమోదైన కేసులను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) తమ టాల్క్-ఆధారిత (Talc-based) బేబీ పౌడర్ వాడకం వల్ల అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) బారిన పడ్డామని నమోదైన కేసులను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. అమెరికాలోని ఫెడరల్, స్టేట్ కోర్టుల్లో దాఖలైన దాదాపు 76,000 కేసులను ఒకేసారి ముగించేందుకు 5.5 బిలియన్ డాలర్ల అనగా సుమారు రూ. 45,000 - 52,000 కోట్లు భారీ పరిహార ఒప్పంద ప్రతిపాదనను సిద్ధం చేసింది. బాధితులు ఎక్కువ మంది పాల్గొంటే ఈ మొత్తం 7 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉండగా, తొలి విడతగా 2027 నాటికి 3 బిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే ఈ డీల్ అమలులోకి రావాలంటే కనీసం 95 శాతం మంది క్లైమెంట్లు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
తమ టాల్క్ పౌడర్ సురక్షితమైనదని, క్యాన్సర్‌కు కారణం కాదని J&J ఇప్పటికీ ఖండిస్తున్నప్పటికీ, సుదీర్ఘ కోర్టు కేసులు మరియు లిటిగేషన్ ఖర్చులను నివారించేందుకే ఈ సెటిల్‌మెంట్ చేస్తున్నట్లు పేర్కొంది. టాల్కమ్ పౌడర్‌లో ఉండే అస్బెస్టాస్ మూలకాల వల్ల క్యాన్సర్ వస్తుందనే ఆరోపణల నేపథ్యంలో, కంపెనీ 2020లోనే US, కెనడాలలో దీని విక్రయాలను నిలిపివేసి, ప్రపంచవ్యాప్తంగా కార్న్‌స్టార్చ్ ఆధారిత పౌడర్ల తయారీకి మారింది. కాగా, ఈ ప్రతిపాదిత సెటిల్‌మెంట్ ముఖ్యంగా అమెరికా కేసులకు మాత్రమే వర్తిస్తుండగా, భారత్‌లోనూ దశాబ్దాలుగా ఈ పౌడర్ వాడకం సాధారణం కావడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.






