అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

by Taduka Kalyani |

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువైన 46.737 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితులను మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన సునీల్, విక్రమ్, రుషికేష్‌లుగా పోలీసులు గుర్తించారు. విచారణలో వీరు ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ పై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Next Story