పట్టుబడ్డ గుప్తనిధుల నిందితులు.. 9మందిపై కేసులు నమోదు

by Kodari Anjali |

ఈ నెల 22న ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామ శివారులో గుప్తనిధుల కోసం తవ్వకాల ఘటనకు సంబంధించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

పట్టుబడ్డ గుప్తనిధుల నిందితులు.. 9మందిపై కేసులు నమోదు
X

దిశ, ఉప్పునుంతల: ఈ నెల 22న ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామ శివారులో గుప్తనిధుల కోసం తవ్వకాల ఘటనకు సంబంధించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై పుట్ట మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన పంబలి రామస్వామి, దుడ్డు భీముడు, జరుపటి రాజు, గద్ద సైదులు, కోనాపూర్ గ్రామానికి చెందిన ముద్దమల్ల వెంకటస్వామి, వంగూరు గ్రామానికి చెందిన నామని శంకర్, రాయిచెడు గ్రామానికి చెందిన పెనిమిల్ల విష్ణు, దాసర్లపల్లి గ్రామానికి చెందిన గంగుల విజేందర్ రెడ్డి, జినుకుంట గ్రామానికి చెందిన ఎల్లికంటి మల్లయ్యలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దర్యాప్తులో భాగంగా నేరానికి ఉపయోగించిన ఒక జేసీబీ ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుప్త నిధుల పేరుతో అక్రమ తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా గుప్త నిధుల పేరుతో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story