- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ లేఖలో లెక్చరర్‌పై ఆరోపణలు
గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి తరుణ్ (18) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, జోగులాంబ ప్రతినిధి: గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి తరుణ్ (18) మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. తరుణ్ గద్వాల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 434 మార్కులు (98.63 శాతం) సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించినట్లు అతను రాసిన లేఖలో పేర్కొన్నాడు. తనతో పాటు చదువుతున్న మరో విద్యార్థికి 435 మార్కులు రావడంతో కేవలం ఒక్క మార్కు తేడా ఉన్నప్పటికీ, శిరీష అనే లెక్చరర్ తనతో అవమానకరంగా మాట్లాడారని లేఖలో ఆరోపించాడు.
విద్యాశాఖ అధికారులు పరిశీలించి..
తనను ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయురాలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంతో తీవ్రంగా బాధపడ్డానని, తన ఆత్మగౌరవం దెబ్బతిందని విద్యార్థి లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై చేయి చేసుకున్నారని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలో తరుణ్ ఆత్మహత్యకు లేఖలో పేర్కొన్న అంశాలకు విద్యార్థి రాసిన లేఖ, కళాశాలలో జరిగిన పరిణామాలు, ఉపాధ్యాయులు–విద్యార్థుల వాంగ్మూలాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యార్థులను ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయుల మాటలు వారి మనోభావాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో విద్యాశాఖ అధికారులు పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






