తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బషీర్ అహ్మద్

by Taduka Kalyani |

తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బషీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు.

తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ గా  బాధ్యతలు చేపట్టిన బషీర్ అహ్మద్
X

దిశ, సికింద్రాబాద్: తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బషీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో డివిజనల్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా బషీర్ అహ్మద్ మాట్లాడుతూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేస్తారని తెలిపారు. అలాగే ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు, నేరస్థులను గుర్తించడం సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు ప్రజలు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

Next Story