- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి దొరకక టాబ్లెట్లతో మత్తు.. ముగ్గురు యువకులపై కేసు
గంజాయి దొరకకపోవడంతో మత్తు కోసం మెడికల్ టాబ్లెట్లను దుర్వినియోగం చేస్తున్న ముగ్గురు యువకులను మంథని పోలీసులు గుర్తించారు.

దిశ, మంథని: గంజాయి దొరకకపోవడంతో మత్తు కోసం మెడికల్ టాబ్లెట్లను దుర్వినియోగం చేస్తున్న ముగ్గురు యువకులను మంథని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి టాబ్లెట్లు, సిరంజీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో మంథని పోలీస్ స్టేషన్‌లో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి మంథనిలోని చెరువు కట్ట ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారని తెలిపారు. వారిని తనిఖీ చేయగా టాబ్లెట్లు, సిరంజీలు లభించినట్లు చెప్పారు. అనంతరం విచారించగా గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు, అది అందుబాటులో లేకపోవడంతో మెడికల్ షాపులో కొనుగోలు చేసిన కొన్ని టాబ్లెట్లను నీటిలో కలిపి ఇంజక్షన్ ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ ఘటనపై ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెడికల్ షాపు యజమానులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మైనర్లు లేదా అనుమానాస్పద వ్యక్తులకు టాబ్లెట్లు విక్రయించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






