బస్టాండ్‌లో తాత్కాలిక పార్కింగ్ ప్లేస్ ఎక్కడ?: కన్స్యూమర్ రైట్స్ కమీషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మెన్

by Kodari Anjali |   (  Updated:2026-07-28 13:57:09  IST  )

మహబూబ్ నగర్ బస్టాండ్‌‌కు తమవారిని బస్ ఎక్కించడానికి వచ్చే ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ స్థలం కల్పించలేదని 'కన్స్యూమర్ రైట్స్ కమీషన్ ఆఫ్ తెలంగాణ' స్టేట్ చైర్మెన్ బూనేటి బాలరాజు ప్రశ్నించారు.

బస్టాండ్‌లో తాత్కాలిక పార్కింగ్ ప్లేస్ ఎక్కడ?: కన్స్యూమర్ రైట్స్ కమీషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మెన్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ బస్టాండ్‌‌కు తమవారిని బస్ ఎక్కించడానికి వచ్చే ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ స్థలం కల్పించలేదని 'కన్స్యూమర్ రైట్స్ కమీషన్ ఆఫ్ తెలంగాణ' స్టేట్ చైర్మెన్ బూనేటి బాలరాజు ప్రశ్నించారు. సంస్థకు ఆధారం ప్రయాణికులే అని గొప్పలు చెప్పుకునే ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, తమవారిని బస్ స్టాండ్ లో దించడానికి వచ్చే వాహనదారులకు తాత్కాలిక పార్కింగ్ సౌకర్యం కల్పించలేదని, పైగా వాహనం ఫోటోలు తీసి పోలీసులకు పంపి చలాన్లు విధించేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బస్టాండ్ లో తినుబండారాలు, పానీయాలు, వాటర్ బాటిళ్లు, ఎంఆర్పీ రేట్లకు విక్రయించకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని, ఎంఆర్పీ రేట్ల పట్టిక కూడా ఉంచలేదని ఆయన ఆరోపించారు. టెండర్ ప్రకారం కేటాయించిన దుకాణాలు కాకుండా, తమ ఇష్టమోచ్చిన దుకాణాలను పెట్టారని, డీఎం, ఆర్ఎం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వెంటనే ద్విచక్ర వాహనదారులకు తాత్కాలిక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, బస్టాండ్ లోని సమస్యలను చక్కదిద్దాలని, లేనిపక్షంలో వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story