- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi: ‘హైడ్రా’ పక్కా ఓ బ్లాక్‌మెయిల్ టూల్.. మాజీ మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్
‘హైడ్రా’పై హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాగ్భానాలు ఎక్కుపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా’ చీఫ్‌గా రంగనాథ్‌ను తక్షణమే తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసిన అంశంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. ‘హైడ్రా’పై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని అన్నారు. ధర్మాసనం చెప్పినట్లుగా హైడ్రా తొమ్మిది తలల విషనాగు అంటూ సెటైర్లు వేశారు. సీఎం ఆ సంస్థను పక్కా ఓ బ్లాక్‌మెయిల్ టూల్‌గా వాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి స్కీమ్ వెనుక పెద్ద స్కామ్ ఉందని, హైడ్రాను అడ్డుపెట్టుకుని దందాలు చేశారని.. వచ్చిన డబ్బులను రాహుల్ గాంధీకి, బీజేపీ అధిష్టానానికి సంచుల్లో నింపి పంపుతున్నారని పేర్కొన్నారు. అందుకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారంటూ కేటీఆర్ బాంబు పేల్చారు.
రేవంత్ రెడ్డికి వేట కుక్కలా ‘హైడ్రా’..
దేశంలో ఏ అధికారి అయినా.. ఏకంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా చరిత్రలో ఎక్కడైనా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘హైడ్రా’ రేవంత్ రెడ్డికి వేట కుక్కలా మారిందని మండిపడ్డారు. ఆ సంస్థను అడ్డుపెట్టుకుని బిల్డర్ల దగ్గర ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా.. అని నిలదీశారు. ఒకవేళ నిజంగానే హైడ్రా మంచి పనులే చేస్తుంటే, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు, కాంగ్రెస్ నేతలు పొంగులేటి, వివేక్, మహేందర్ రెడ్డి, కేవీపీ ఫామ్‌హౌసులు ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. ఎదిఏమైనా.. తాము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ‘హైడ్రా’ను బంగాళాఖాతంలో పారేస్తామని ప్రజలకు కేటీఆర్ హామీ ఇచ్చారు.
‘నందన్ నిలేకని కమిటీ’ని స్వాగతిస్తున్నాం..
ఇక, ‘నీట్’ పేపర్ లీక్ ఇష్యూలో మోడీ ప్రభుత్వంపై తొలిసారి యువత తిరగబడిందని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల, వాళ్లు ప్రజలకు మద్దతుగా నిలబడలేక యువత నేరుగా ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. అవసరం ఉన్నప్పుడు యువత రియాక్ట్ అవుతుందని గతంలో కేసీఆర్ చెప్పిన మాట నిజమైందని గుర్తు చేశారు. ఆన్‌లైన్ ఉద్యమం ఉగ్రరూపం దాల్చి ఏకంగా పార్లమెంట్‌ను చుట్టుముట్టిందని.. దేశంలో జెన్-జీ (GenZ) ఉద్యమం జరుగుతోందని అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో 3 సార్లు ‘నీట్’ పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. ఇదే సమయంలో యాంటీ పేపర్ లీక్ బిల్లును తమ పార్టీ స్వచ్ఛందగా సమర్థిస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ‘నందన్ నిలేకని కమిటీ’ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.






