మల్కాజ్‌గిరిలో బీజేపీకి ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్‌లోకి కీలక నేత

by Kodari Anjali |

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని గౌతమ్‌నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మా శెట్టి అనిల్ కుమార్ గుప్తా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

మల్కాజ్‌గిరిలో బీజేపీకి ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్‌లోకి కీలక నేత
X

దిశ, మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని గౌతమ్‌నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మా శెట్టి అనిల్ కుమార్ గుప్తా మంగళవారం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం మా శెట్టి అనిల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. త్వరలో తన అనుచరులు, స్నేహితులతో కలిసి మరింత మంది నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్‌లో చేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, బైరు అనిల్, హేమంత్ పటేల్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్సింగ్, గౌస్ ఇమ్రాన్, జక్కుల కిరణ్ ముదిరాజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Next Story