DisneyPlus Hotstar : ప్రీమియం ఆఫర్‌తో రెండు కొత్త ప్లాన్‌లను ప్రకటించిన జియో!

by Web Desk |
DisneyPlus Hotstar : ప్రీమియం ఆఫర్‌తో రెండు కొత్త ప్లాన్‌లను ప్రకటించిన జియో!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 1,499, రూ. 4,199 ధరల్లో వచ్చే ప్లాన్‌ల ద్వారా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. వీటిలో రూ. 1,499 ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2జీబీని 84 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇంకా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఒక ఏడాది డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వినియోగించవచ్చు.

రూ. 4,199 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటాను 365 రోజుల వ్యాలిడిటీ తో పొందడానికి వీలుంటుంది. అదేవిధంగా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్ సబ్‌స్క్రిప్షన్, కాంప్లిమెంటరీగా ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వినియోగదారులు ఈ రెండు ప్లాన్‌లను రీఛార్జ్ చేసిన తర్వాత తమ 'మై జియో' అకౌంట్‌లో డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం కూపన్ కోడ్‌ను అందుకుంటారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు ప్రత్యేకమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉపయోగించవచ్చు. డిస్నీప్లస్, హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నుంచి కస్టమర్లు తమకిష్టమైన కంటెంట్‌ను 4కె క్వాలిటీలో ఒకేసారి 4 డివైజ్‌లలో వినియోగించుకునేందుకు వీలుంటుంది. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, టీవీలలో కనెక్ట్ చేసుకోవచ్చని జియో వివరించింది. ఇందులో లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఎక్స్‌క్లూజివ్ ఎపిసోడ్స్, సినిమా, సీరియల్, డిస్నీ ప్లస్ సినిమా, ఒరిజినల్ కంటెంట్‌లను చూడవచ్చు.


Next Story