Janvi Kapoor : పుష్ప-2 ట్రోలింగ్ పై జాన్వీ ఫైర్

by M.Rajitha |
Janvi Kapoor : పుష్ప-2 ట్రోలింగ్ పై జాన్వీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), సుకుమార్‌(Sukumar) కాంబోలో పుష్ప-2(Pushpa-2) ఈ నెల 5న గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున థియేటర్స్‌లో మూవీ విడుదలైంది. అయితే, అక్కడ ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. పుష్ప-2 కారణంగా హాలీవుడ్‌ మూవీ ఇంటర్‌స్టెల్లార్‌ రీ రిలీజ్‌ వాయిదాపడిందంటూ పలువురు సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారు. పుష్ప-2కి ఎక్కువ థియేటర్లు ఇచ్చారంటూ వస్తున్న ట్రోలింగ్ పై బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌(Janwi Kapoor) స్పందించింది. హాలీవుడ్‌ వారంతా భారతీయ సినిమాలను మెచ్చుకుంటున్నారని.. కానీ, మనమే మన చిత్రాలను తక్కువ చేసుకుంటున్నామంటూ మండిపడింది. పుష్ప-2 సైతం ఒక మూవీనేనని.. ఈ సినిమాను మరోదానితో పోలుస్తూ తక్కువ చేయడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించింది. మీరు ఏ హాలీవుడ్‌ సినిమాకు సపోర్ట్‌ చేస్తున్నారో.. వారంతా మన చిత్రాలనే మెచ్చుకుంటుంటే.. మనం మన చిత్రాలను తక్కువ చేసుకుంటూ అవమానించుకుంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి చూసినప్పుడే బాధగా ఉంటుందంటూ జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌లోనూ పుష్ప-2 ర్యాంపేజ్‌ కొనసాగుతున్నది. తొలిరోజే ఏకంగా రూ.72కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Advertisement

Next Story

Most Viewed