ఆ యాంకర్ తో పెళ్లంటూ వార్తలు.. స్పందించిన JD చక్రవర్తి

by Muthe.Rajitha |

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ విష్ణుప్రియకు, నటుడు జేడీ చక్రవర్తికి వివాహం ఫిక్స్ అయినట్టు వస్తున్న వార్తలను జేడీ ఖండించారు.

ఆ యాంకర్ తో పెళ్లంటూ వార్తలు.. స్పందించిన JD చక్రవర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ యాంకర్ విష్ణుప్రియకు, నటుడు జేడీ చక్రవర్తికి వివాహం ఫిక్స్ అయినట్టు వస్తున్న వార్తలను జేడీ ఖండించారు. గతకొంతకాలంగా వస్తున్న రూమర్లపై జేడీ చక్రవర్తి ఘాటుగా స్పందిస్తూ.. విష్ణుప్రియ తనకు కేవలం ఒక ప్రియ శిష్యురాలు మాత్రమేనని స్పష్టం చేశారు. "ఆమె నన్ను ఎప్పుడూ గురువుగా గౌరవిస్తుంది. తనకు ఏదైనా సందేహం వచ్చినా లేదా అవసరమున్నా ఫోన్ చేసి 'గురువుగారు' అని పిలుస్తుందే తప్ప, మా మధ్య అంతకు మించిన సంబంధం ఏమీ లేదు" అని ఆయన పేర్కొన్నారు. తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన (Professional) అనుబంధం మాత్రమేనని, పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని ఆయన ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు.

కాగా గతంలో ఒక టీవీ షోలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. జేడీ చక్రవర్తిపై తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ.. "ఆయన తల్లి అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను" అని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ తరువాత తాను చేసిన వ్యాఖ్యలను అతిగా ఊహించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. దీంతో గత కొంతకాలంగా సాగుతున్న జేడీ, విష్ణుప్రియ పెళ్లి పుకార్లకు తెరపడినట్లయింది.

Next Story