- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటి ఇష్యూ.. స్పందించిన జనసేన పార్టీ
వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) వ్యవహారంపై జనసేన పార్టీ(Jana Sena Party) స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాత్తు శ్రీవారి సొమ్ము రూ.250 కోట్లు దోపిడీ చేయడమే కాకుండా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో ఆవు నెయ్యి బదులుగా, 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వాడటమే కాకుండా, SIT రిపోర్ట్ ద్వారా 36 మంది ఈ పాపంలో భాగం అయ్యారు అని చెప్పినా సరే ప్రభుత్వంపై నిందలు వేస్తారా?. మీరు చేసిన తప్పులు ప్రజలకు వివరించేలా ఫ్లెక్సీలు వేయిస్తే రౌడీయిజంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారా?. మీరు చేసేది తప్పు అని అడ్డుకుంటే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తారా?. అంబటి చేసినవి విమర్శలు కాదు, ఇది తప్పు చేసిన మమ్మల్ని ఏమీ చేయలేరు అనే అహంకారంతో వాగిన చిల్లర వాగుడు.. వైఎస్ఆర్ బూతు పార్టీ నాయకుడిగా బండ బూతులతో రెచ్చి పోయిన అంబటి రాంబాబు ను తక్షణమే అరెస్ట్ చేయాలి.
అరెస్ట్ చేయాల్సిందే
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడలేకపోతే ఇక సామాన్యులపై జరిగే దాడులను ఎలా అరికడతాం?. ఒక మాజీమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన అంబటి రాంబాబు బజారు రౌడీలా ప్రవర్తిస్తే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లు?. ముఖ్యమంత్రిపై రాంబాబు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి పోలీసులు అరెస్ట్ చేయాలి, భవిష్యత్తులో ఇలా మరే ఇతర నాయకుడు ప్రవర్తించకుండా న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి’ అని జనసేన అధిష్టానం డిమాండ్ చేసింది.






